రామ్ చరణ్‌-బుచ్చిబాబు టైటిల్‌, టీజర్‌ మార్చి 27న?

బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్ చరణ్‌, జాన్వీ కపూర్‌ జంటగా ఆర్‌సీ16 వర్కింగ్ టైటిల్‌తో చేస్తున్న సినిమాకు ‘పెద్ది’ అనే టైటిల్‌ ఖరారు చేసిన్నట్లు తెలుస్తోంది. దీనికి అభిమానులు, నెటిజన్స్ నుంచి పెద్దగా స్పందన రానప్పటికీ సినిమా కధకు ఇదే సరైన టైటిల్‌ అని దర్శకుడు బుచ్చిబాబు ఫిక్స్ అయిన్నట్లు తెలుస్తోంది. ఈ నెల 27న రాం పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా టైటిల్‌ ప్రకటించి, టీజర్‌ విడుదల చేసే అవకాశం ఉంది. 

ఈ సినిమాలో జగపతి బాబు, శివ రాజ్ కుమార్‌, దివ్యేంద్రు తదితరులు ముఖ్య పాత్రలు చేస్తున్నారు. ఈ సినిమాకి సంగీతం: ఏఆర్ రహమాన్, కెమెరా: రత్నవేలు అందిస్తున్నారు. 

సుకుమార్ రైటింగ్స్, మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లపై వెంకట సతీష్ కిలారు ఈ సినిమాని పాన్ ఇండియా మూవీగా 5 భాషల్లో నిర్మిస్తున్నారు.