
నితిన్, శ్రీలీల జంటగా చేసిన ‘రాబిన్‌హుడ్’ సినిమాలో ‘అదిదా సర్‌ప్రీజు...’ అంటూ కేతికా శర్మ ఓ ఐటెమ్ సాంగ్ చేసింది. ఆ పాటకు విశేష ఆదరణ లభిస్తోంది. కానీ అదేమీ సర్‌ప్రీజు కాదు మేమిస్తున్న సర్‌ప్రీజు కూడా చూడండని తెలంగాణ మహిళా కమీషన్ ‘రాబిన్‌హుడ్’కి షాకింగ్ సర్‌ప్రీజు ఇచ్చింది.
‘రాబిన్‌హుడ్’ సినిమాలో అదిదా సర్‌ప్రీజు పాట, దానికి కేతికా శర్మ చేసిన డాన్స్ మహిళల మనోభావాలు దెబ్బ తీస్తున్నాయి కనుక సినిమాలో నుంచి ఆ పాటని తొలగించాలని మహిళా కమీషన్ ‘రాబిన్‌హుడ్’ దర్శక నిర్మాతలకు లేఖ ద్వారా సూచించిన్నట్లు తాజా సమాచారం.
ఆ పాటకు డాన్స్ చేసేందుకు కేతికా శర్మకు భారీగా పారితోషికం ఇచ్చారు. ‘రాబిన్‌హుడ్’ పాన్ ఇండియా మూవీగా 5 భాషల్లో విడుదల చేస్తున్నందున ఖర్చుకి వెనకాడకుండా ఆ పాటని చిత్రీకరించారు. ఈ నెల 28న సినిమా విడుదల కాబోతుంటే ఇప్పుడు ఆ పాటని తీసేయాలని మహిళా కమీషన్ ఆదేశించడమే అతి పెద్ద సర్‌ప్రీజు. దీనిపై రాబిన్‌హుడ్ ఏమంటాడో చూడాలి.
వెంకీ కుడుమల దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ ‘రాబిన్ హుడ్’ని పాన్ ఇండియా మూవీగా 5 భాషలలో నిర్మించారు.
ఈ సినిమాకు కధ, దర్శకత్వం: వెంకీ కుడుముల, సంగీతం: జీవి ప్రకాష్, కెమెరా: సాయి శ్రీరామ్, ఆర్ట్ డైరెక్టర్: రామ్ కుమార్, ఎడిటింగ్: కోటి చేశారు.