
తెలంగాణ ప్రభుత్వం గద్దర్ అవార్డులకు సంబందించి నోటిఫికేషన్ జారీ చేసింది. తెలుగు సినీ పరిశ్రమలో వివిద విభాగాల కింద ఎంపికైన చిత్రాలకు, నటీనటులు, దర్శకులు తదితరులకు గద్దర్ అవార్డుతో పాటు నగదు పురస్కారాలు కూడా ఇస్తుంది.
ఉత్తమ ఫీచర్ ఫిల్మ్ (గోల్డ్) : బంగారు మెమెంటో, నిర్మాతకు సర్టిఫికెట్, రూ.10 లక్షలు, దర్శకుడికి వెండి మెమెంటో, సర్టిఫికెట్, రూ.5 లక్షలు నగదు బహుమతి.
ఉత్తమ ఫీచర్ ఫిల్మ్ (సిల్వర్) : వెండి మెమెంటో, నిర్మాతకు సర్టిఫికెట్, రూ.7 లక్షలు, దర్శకుడికి కాంస్య మెమెంటో, సర్టిఫికెట్, రూ.3 లక్షలు నగదు బహుమతి.
ఉత్తమ ఫీచర్ ఫిల్మ్ (బ్రాంజ్) : కాంస్య మెమెంటో, నిర్మాతకు సర్టిఫికెట్, రూ.5 లక్షలు, దర్శకుడికి సర్టిఫికెట్, రూ.1 లక్ష నగదు బహుమతి.
తొలిసారిగా ఉర్దూలో ఉత్తమ ఫీచర్ ఫిల్మ్ (గోల్డ్) కింద గద్దర్ అవార్డు ఇవ్వబోతోంది. దీనికి ఎంపికైన సినిమాకు బంగారు మెమెంటో, నిర్మాతకు సర్టిఫికెట్, రూ.10 లక్షలు, దర్శకుడికి వెండి మెమెంటో, సర్టిఫికెట్, రూ.5 లక్షలు నగదు బహుమతి అందించబోతోంది.
డాక్యుమెంటరీ చిత్రాలకు ఫస్ట్ బెస్ట్, సెకండ్ బెస్ట్, థర్డ్ బెస్ట్, డిప్లొమా ఆఫ్ మెరిట్ కింద అవార్డులు, నగదు బహుమతులు.
ఉత్తమ దర్శకుడు, ఉత్తమ ప్రధాన నటుడు (హీరో), ఉత్తమ ప్రధాన నటి (హీరోయిన్): వెండి మెమెంటో, రూ.5 లక్షలు నగదు బహుమతి, సర్టిఫికెట్.
ఉత్తమ సహాయ నటీనటులకు: కాంస్య మెమెంటో, రూ.3 లక్షలు నగదు బహుమతి, సర్టిఫికెట్.
ఇంకా ఉత్తమ హాస్య నటులు, ఉత్తమ బాల నటులు, ఉత్తమ సంగీత దర్శకులు, ఉత్తమ నేపద్య గాయనీ గాయకులు, ఉత్తమ రచయిత, ఉత్తమ స్క్రీన్ ప్లే రైటర్స్, ఉత్తమ పాటల రచయిత, ఉత్తమ సినిమాటోగ్రాఫర్, ఉత్తమ కొరియోగ్రాఫర్, ఉత్తమ ఎడిటర్, ఉత్తమ యాక్షన్ కొరియోగ్రాఫర్, ఉత్తమ మేకప్ ఆర్టిస్ట్‌లకు ప్రభుత్వం గద్దర్ అవార్డులు ఇస్తుంది.
ఇవికాక ఫీచర్ ఫిల్మ్స్ విభాగంలో నాలుగు స్పెషల్ జ్యూరీ అవార్డులు ఇస్తుంది. వీటికి ఎంపికైన వారికి రూ.3 లక్షలు నగదు, సర్టిఫికెట్ ఇస్తుంది.
ఏప్రిల్ నెలలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి ఈ అవార్డులను ప్రధానం చేస్తారు.