
మంచు విష్ణు ‘కన్నప్ప’గా చేస్తున్న సినిమాలో అతని తండ్రి, మోహన్ బాబు మహాదేవ శాస్త్రిగా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా కన్నప్పలో ఆయన గ్లింమ్స్ విడుదల చేశారు.
మునీశ్వరుడి వేషధారణలో మోహన్ బాబు చాలా చక్కగా ఉన్నారు. అయితే గ్లింమ్స్లో ఆయన డైలాగ్స్ ఏమీ ఇవ్వకపోవడం అభిమానులకు కాస్త నిరాశ కలిగిస్తుంది. ఆయన నటన, కంచుకంఠంతో ఆయన పలికే డైలాగ్స్ ఈ సినిమాకు హైలైట్గా నిలుస్తాయని భావించవచ్చు.
ఈ సినిమాలో కన్నప్పకి జోడీగా నుపూర్ సనన్ నటిస్తోంది. అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్ శివపార్వతులుగా, ప్రభాస్ రుద్రుడుగా నటిస్తున్నారు. బ్రహ్మానందం, శరత్ కుమార్, మోహన్ లాల్ తదితరులు ఈ సినిమాలో ముఖ్యపాత్రలు చేస్తున్నారు.
కన్నప్ప సినిమాకు దర్శకత్వం: ముఖేష్ కుమార్ సింగ్, సంగీతం: స్టీఫెన్ దేవాస్సీ, కెమెరా: షెల్డన్ షావ్, ఆర్ట్: చిన్న, ఎడిటింగ్: ఆంథోనీ చేస్తున్నారు.
అవా ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై మోహన్ బాబు, మంచు విష్ణు సుమారు రూ.200 కోట్ల భారీ బడ్జెట్తో కన్నప్ప నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఏప్రిల్ 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది.
<iframe width="560" height="315" src="https://www.youtube.com/embed/NKY09KLGkyQ?si=iPVlPutYhUYuDEEm" title="YouTube video player" frameborder="0" allow="accelerometer; autoplay; clipboard-write; encrypted-media; gyroscope; picture-in-picture; web-share" referrerpolicy="strict-origin-when-cross-origin" allowfullscreen></iframe>