రామ్ చరణ్‌-బుచ్చిబాబు సినిమా అప్‌డేట్‌

రామ్ చరణ్‌-బుచ్చిబాబు కాంబినేషన్‌లో ఓ క్రీడాంశం నేపద్యంతో తీస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్‌ హైదరాబాద్‌ రామోజీ ఫిల్మ్ సిటీలో జోరుగా సాగుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్‌ రామ్ చరణ్‌కు జోడీగా నటిస్తోంది.  జగపతి బాబు, శివ రాజ్ కుమార్‌, దివ్యేంద్రు తదితరులు ముఖ్య పాత్రలు చేస్తున్నారు.

ఈ సినిమా గురించి ఓ ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. ఇటువంటి క్రీడా నేపద్యంతో తీసే సినిమాలలో సాధారణంగా హీరో కోచ్‌ లేదా క్రీడాకారుడు పాత్రల్లో నటిస్తుంటారు. కానీ ఈ సినిమా రామ్ చరణ్‌ అవుట్ సోర్సింగ్ పద్దతిలో ఓ జట్టు తరపున ఆడే కాంట్రాక్ట్ ఆటగాడిగా నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఆ పద్దతిలో, ఆ స్థాయిలో ఆడే ఆటగాళ్లకు ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటారో ఊహించవచ్చు. కనుక ఈ సినిమా కధ, కధలో రామ్ చరణ్‌ పాత్ర రెండూ కూడా చాలా డిఫరెంట్‌గా దర్శకుడు బుచ్చిబాబు చూపించబోతున్నట్లు భావించవచ్చు.    

నిర్మాత వెంకట సతీష్ కిలారు ఈ సినిమాని సుకుమార్ రైటింగ్స్, మైత్రీ మూవీ మేకర్స్ కలిసి పాన్ ఇండియా మూవీగా నిర్మిస్తున్న ఈ సినిమాకి సంగీతం: ఏఆర్ రహమాన్, కెమెరా: రత్నవేలు చేస్తున్నారు.