రాబిన్‌హుడ్ ట్రైలర్‌ ముహూర్తం ఖరారు

దర్శకుడు వెంకీ కుడుమల, నితిన్‌, శ్రీలీల కాంబినేషన్‌లో ‘రాబిన్‌హుడ్’ ఈ నెల 28న విడుదల కాబోతోంది. సీమా రిలీజ్‌ డేట్ దగ్గర పడుతుండటంతో ట్రైలర్‌ రిలీజ్‌కి ముహూర్తం పెట్టేశారు. నితిన్‌ పోస్టర్‌ వేసి ఈ శుక్రవారం సాయంత్రం 4.05 గంటలకు ట్రైలర్‌ విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు.       

ఈ సినిమాలో ప్రముఖ ఆస్ట్రేలియన్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ అతిధి పాత్రలో నటిస్తున్నారు. ఇటీవలే ఆయన ఫస్ట్-లుక్‌ పోస్టర్ కూడా విడుదల చేశారు. 

ఈ సినిమాలో కేతికా శర్మ ‘అదిదా సర్‌ప్రైజు...’ అంటూ ఓ ఐటెమ్ సాంగ్‌ చేసింది. ఆ పాటకు, దాని మ్యూజిక్, దానిలో ఆమె డాన్స్‌కి మంచి ఆదరణ లభిస్తోంది. 

ఈ సినిమాకు కధ, దర్శకత్వం: వెంకీ కుడుముల, సంగీతం: జీవి ప్రకాష్, కెమెరా: సాయి శ్రీరామ్, ఆర్ట్ డైరెక్టర్: రామ్ కుమార్, ఎడిటింగ్: కోటి చేశారు. 

మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ ‘రాబిన్ హుడ్‌’ని పాన్ ఇండియా మూవీగా 5 భాషలలో నిర్మించారు. ఈ సినిమాతో హిట్ కొడితే నితిన్‌ కూడా పాన్ ఇండియా హీరోగా మంచి గుర్తింపు సంపాదించుకో గలుగుతాడు.