అర్జున్‌ సన్ ఆఫ్ వైజయంతి టీజర్‌

ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ 21వ సినిమా ‘అర్జున్‌ సన్ ఆఫ్ వైజయంతి’ టీజర్‌ సోమవారం విడుదల చేశారు. 

ఈ సినిమాలో విజయశాంతి, కళ్యాణ్ రామ్ తల్లీ కొడుకులుగా చేస్తున్నారు. విజయశాంతి మళ్ళీ చాలా కాలం తర్వాత పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌ పాత్ర చేస్తున్నారు. కనుక టీజర్‌లో యాక్షన్ సీన్స్, తల్లీకొడుకుల మద్య భావోద్వేగా సన్నివేశాలున్నాయి.  

ఈ సినిమాలో శ్రీకాంత్, సాయి మంజ్రేకర్, సొహైల్ ఖాన్ తదితరులు ముఖ్య పాత్రలు చేస్తున్నారు. 

ఎన్టీఆర్‌ ఆర్ట్స్, అశోకా క్రియేషన్స్ బ్యానర్లపై ముప్పా వెంకయ్య చౌదరి, సునీల్ బులుసు కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాకు కధ, దర్శకత్వం: ప్రదీప్ చిలుకూరి, సంగీతం అజనీష్ లోక్‌నాధ్, కెమెరా: రామ్ ప్రసాద్, ఎడిటింగ్: తమ్మిరాజు చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్‌ దాదాపు చివరి దశకు చేరుకుంది. 

ఈ వేసవి సెలవుల్లో ‘అర్జున్‌ సన్ ఆఫ్ వైజయంతి’ విడుదల కాబోతోందని నిన్న విడుదల చేసిన టీజర్‌లో మరోసారి వెల్లడించారు.