రైల్వే కాలనీలో అల్లరి నరేష్ ఏం చేస్తున్నాడు?

ఒక్కప్పుడు కామెడీ సినిమాలకే పరిమితమైన అల్లరి నరేష్ తర్వాత సీరియస్ సబ్జెక్ట్ ఎంచుకొని చేస్తున్నాడు. అటువంటిదే ‘బచ్చలమల్లి’ కూడా. ఈ సినిమాలో అల్లరి నరేష్ తన నటనతో ప్రేక్షకులను మెప్పించగలిగాడు కానీ సినిమా మెప్పించలేకపోయింది. 

దాని తర్వాత  నాని కాసరగడ్డ దర్శకత్వంలో మరో సినిమా మొదలుపెట్టాడు. దానికి 12ఏ, రైల్వే కాలనీ అనే పేరు ఖరారు చేసి టైటిల్‌ టీజర్‌ విడుదల చేశారు. ఇదో దెయ్యాలు, ఆత్మలు, మర్డర్స్ మిస్టరీ సినిమా అని టీజర్‌తోనే చెప్పేశారు. 

ఈ సినిమాలో డా. కామాక్షి భాస్కర్, సాయి కుమార్‌, వివా హర్ష, గెటప్ శ్రీను, సద్దాం, జీవన కుమార్‌, గగన్ విహారీ, అనిష్ కురువిళ్ళ, మధుమణి తదితరులు ముఖ్య పాత్రలు చేస్తున్నారు.

ఈ సినిమాకు కధ, డైలాగ్స్, స్క్రీన్ ప్లే: డా. అనిల్ విశ్వనాధ్, దర్శకత్వం, ఎడిటింగ్: నాని కాసరగడ్డ సంగీతం: భీమ్స్ సిసిరోలియో, కెమెరా: కుషెందర్ రమేష్ రెడ్డి, చేస్తున్నారు.