
శర్వానంద్-అనుపమ పరమేశ్వరన్ శతమానం భవతి సినిమాలో కలిసి చేశారు. ఇన్నేళ్ళ తర్వాత మళ్ళీ వారిద్దరూ కలిసి మరో సినిమా చేయబోతున్నారు. సంపత్ నంది దర్శకత్వంలో చేయబోతున్న సినిమాలో శర్వానంద్‌కి హీరోయిన్‌గా చేయాలని ఆమెను కోరగా వెంటనే అంగీకరించారు.
అనుపమ పరమేశ్వరన్ ఇటీవల రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ సినిమాలో ఓ పాత్రలో కొద్ది సేపే కనిపించినా అందరినీ ఆకట్టుకున్నారు. ఇక శర్వానంద్ ప్రస్తుతం నారీ నారీ మురారి, కొత్త దర్శకుడు అభిలాష్‌తో ఓ సినిమా చేస్తున్నారు. వాటిలో నారీ నారీ మద్య మురారి సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఈలోగా తమన్నా ప్రధాన పాత్రలో సంపత్ నంది ఓదెల-2 సినిమా పూర్తి చేశారు. కనుక శర్వానంద్‌కు కధ చెప్పి ఓకే అనిపించేసుకొని అనుపమ చేత ఓకే అనిపించేసుకున్నారు. సంపత్ నంది-శర్వానంద్-అనుపమల సినిమా షూటింగ్ ఏప్రిల్ నెలాఖరులోగా ప్రారంభం కానున్నది.