
అల్లు అర్జున్-సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన పుష్ప-1,2 సూపర్ హిట్ అవడంతో అందరూ పుష్ప-3 ఎప్పుడా అని ఎదురుచూస్తున్నారు. అయితే పుష్ప-3 మూడేళ్ళ తర్వాత అంటే 2028లో విడుదలవుతుందని నిర్మాత రవిశంకర్ చెప్పేశారు.
ఆదివారం విజయవాడలో రాబిన్‌హుడ్ ప్రమోషన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. వాటిలో పాల్గొన్న ఆయన అల్లు అర్జున్ సినిమాల గురించి విలేఖరులు అడిగిన ప్రశ్నకు సమాధానం చెపుతూ, “ప్రస్తుతం అల్లు అర్జున్ దర్శకుడు అట్లీతో చేస్తున్న సినిమా 2026లో వస్తుంది.
త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో చేయబోయే సినిమా 2027లో, సుకుమార్‌తో పుష్ప-3 2028లో వస్తాయి,” అని చెప్పారు. అంటే 2026 నుంచి ఏడాదికో సినిమా చొప్పున వరుసగా మూడు సినిమాలు వస్తాయన్న మాట! అల్లు అర్జున్ అభిమానులకు ఇంతకంటే సంతోషకరమైన వార్తా ఏముంటుంది?