కాలేజీ యువతతో రాబిన్‌హుడ్ డాన్సులు

నితిన్‌, శ్రీలీల జంటగా నటించిన ‘రాబిన్‌హుడ్’ ఈ నెల 28న విడుదల కాబోతోంది. కనుక సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా శనివారం ఏపీలోనివ భీమవరం, రాజమండ్రిలో పర్యటించి స్థానిక కాలేజీలలో యువతతో సరదాగా ఆడి పాడారు. విద్యార్ధులు అడిగిన కొంటె ప్రశ్నలకు కొంటె సమాధానాలు చెప్పి అలరించారు. నితిన్‌, శ్రీలీల విద్యార్ధులతో కలిసి చేసిన డాన్సుల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

ఈ సినిమాలో కేతికా శర్మ ‘అదిదా సర్‌ప్రైజు’ ఐటం సాంగ్‌ చేయగా, ప్రముఖ ఆస్ట్రేలియన్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ అతిధి పాత్రలో నటించారు. శనివారం ఆయన ఫస్ట్-లుక్‌ పోస్టర్ విడుదల చేశారు.

ఈ సినిమాకు కధ, దర్శకత్వం: వెంకీ కుడుముల, సంగీతం: జీవి ప్రకాష్, కెమెరా: సాయి శ్రీరామ్, ఆర్ట్ డైరెక్టర్: రామ్ కుమార్, ఎడిటింగ్: కోటి చేశారు. 

మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ ‘రాబిన్ హుడ్‌’ని పాన్ ఇండియా మూవీగా 5 భాషలలో నిర్మించారు.