సమంత సొంత బ్యానర్‌లో మొదటి సినిమా శుభం

ప్రముఖ నటి సమంత సొంత బ్యానర్‌ ‘ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్’లో తొలి సినిమా పేరు ‘శుభం.. సబ్ టైటిల్ చచ్చినా చూడాల్సిందే.’ ఈ సినిమాకు ‘సినిమా బండి’ ఫేమ్ దర్శకుడు ప్రవీణ్ కాండ్రేగుల దర్శకత్వం వహించగా నూతన నటీనటులు గవిరెడ్డి శ్రీనివాస్, మల్గిరెడ్డి, చరణ్‌ పేరి, షాలిని కొండెపూడి, శ్రీయ కొంఠం తదితరులు ముఖ్య పాత్రలు చేశారు. ఈ సినిమాలో సమంత అతిధి పాత్రలో నటించారు. 

ఈ సినిమాకు కధ: వసంత్ మరిగంటి, కెమెరా: మృధుల్ సుజీత్ విశ్వక్‌ సేన్‌, ఎడిటింగ్: ధర్మేంద్ర కాకర్ల చేశారు.