అతన్ని ఎంకరేజ్ చేస్తున్న మహేష్..!

సూపర్ స్టార్ మహేష్ ప్రస్తుతం చేస్తున్న మురుగదాస్ మూవీ పూర్తి కాగానే కొరటాల శివతో సినిమా చేసేందుకు రంగం సిద్ధం చేశారు. ఆల్రెడీ ముహుర్తం పెట్టిన ఈ సినిమా ఫిబ్రవరి నుండి రెగ్యులర్ షూటింగ్ ఉంటుందట. అయితే ఆ సినిమా తర్వాత పివిపి బ్యానర్లో మహేష్ వంశీ పైడిపల్లి డైరక్షన్లో ఓ సినిమా ఉంటుందని తెలిసిందే. స్వయంగా నిర్మాత ప్రసాద్ పొట్లూరి ఈ విషయం వెళ్లడించారు. అయితే ఈ క్రమంలో వంశీ ఇప్పటికే ఆ సినిమాకు సంబందించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ చేశాడట.

ఇక ఆ సినిమా మ్యూజిక్ డైరక్టర్ గా గోపిసుందరం ను సెలెక్ట్ చేశారట. తెలుగులో ఇప్పటికే మంచి టేస్ట్ ఉన్న సంగీత దర్శకుడిగా క్రేజ్ తెచ్చుకున్న ఈ మలయాళ మ్యూజిక్ డైరక్టర్ ఊపిరి సినిమాకు వంశీతో కలిసి పనిచేశాడు. ఇక మహేష్ సినిమాకు కూడా అతన్నే మళ్లీ ఫైనల్ చేశారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ సినిమాలో మహేష్ కొత్తగా కనిపిస్తాడట. కథ అంతా ఫైనల్ కాగా వచ్చే ఏడాది సెకండ్ హాఫ్ లో సినిమా స్టార్ట్ అవుతుందని అంటున్నారు.