
నేడు హోళీ పండుగ సందర్భంగా ఓటీటీలోకి పలు సినిమాలు విడుదలయ్యాయి. వాటిలో కంగనా రనౌత్, అనుపమ్ ఖేర్, శ్రేయస్ తల్పడే ప్రధాన పాత్రలు చేసిన ‘ఎమర్జన్సీ’ కూడా ఒకటి. దివంగత ప్రధాని ఇందిరా గాంధీ హయంలో దేశంలో ‘ఎమర్జన్సీ’కి దారి తీసిన కారణాలు, ఎమర్జన్సీ విధించినప్పుడు జరిగిన సంఘటనల ఆధారంగా ఈ సినిమా తీశారు.
ఈ సినిమాలో కంగనా రనౌత్ దివంగత ప్రధాని ఇందిరా గాంధీగా , అనుపమ్ ఖేర్ జయప్రకాష్ నారాయణ్‌గా, శ్రేయస్ తల్పడే దివంగత ప్రధాని అటల్ బిహారీ వాజ్ పెయిగా నటించారు.
తీవ్ర వివాదాల నడుమ జనవరి 17న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను పెద్దగా మెప్పించలేకపోయింది. ఇప్పుడు ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లోకి వచ్చేసింది. కనుక ఓటీటీ ప్రేక్షకులు ఏమంటారో చూడాలి.
అక్కినేని అఖిల్ నటించిన ‘ఏజంట్’ సినిమా నేడు హోళీ పండుగ సందర్భంగా సోనీ లివ్ ఓటీటీలో ప్రసారం అవుతోంది. ఈ రెండు కాక, బ్రహ్మానందం, రేఖా చిత్రం రెండు సినిమాలు ఆహా ఓటీటీలో ప్రసారమవుతున్నాయి.
హోళీ పండుగ సందర్భంగా ఈటీవీ విన్ ఓటీటీలోకి రామం రాఘవం సినిమా వస్తోంది. జియో హాట్ స్టార్ ఓటీటీలో మోనా-2, ఫోన్ మ్యాన్, అనోరా మూడు సినిమాలు, నెట్‌ఫ్లిక్స్‌లో ఆజాద్, అమెజాన్ ప్రైమ్‌లో బీ హ్యాపీ సినిమాలు ప్రసారం కాబోతున్నాయి.