
ఒకప్పుడు వరుస హిట్లు ఇచ్చిన అక్కినేని హీరోలు చాలా కాలంగా సరైన హిట్ పడక ఇబ్బంది పడుతుంటే దర్శకుడు చందు మొండేటి మొండేటి అక్కినేని నాగ చైతన్యతో ‘తండేల్’ తీసి హిట్ అందించారు. దీంతో నాగ చైతన్య కెరీర్ మళ్ళీ గాడిన పడింది. తండేల్ సూపర్ హిట్ అవడంతో సహజంగానే పెద్ద హీరోల నుంచి చందూకి ఆఫర్లు వస్తున్నాయి.
కానీ ఇదివరకే కోలీవుడ్ హీరో సూర్యతో ఓ సినిమాకి కమిట్ అయ్యారు. కానీ సూర్య వేరే సినిమాలతో బిజీగా ఉండటంతో చిన్న గ్యాప్ దొరికింది. ఈ గ్యాప్‌లో మరో సినిమా పూర్తిచేయవచ్చని భావించిన చందూ, యంగ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేనిని కలిసి ఓ కధ చెప్పగా దానిని ఓకే చేసిన్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం రామ్ పోతినేని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లో మహేష్ బాబు బాపు దర్శకత్వంలో ర్యాపో22 వర్కింగ్ టైటిల్‌తో ఓ సినిమా చేస్తున్నాడు. త్వరలో అది పూర్తికాగానే చందు మొండేటి మొండేటితో సినిమా మొదలుపెట్టే అవకాశం ఉంది.
ర్యాపో22లో రామ్ పోతినేనికి జోడీగా భాగ్యశ్రీ బోరే నటిస్తోంది. ఈ సినిమాకి పాటలు: రామ్ మిరియాల, కార్తీక్ సంగీతం: వివేక్, మెర్విన్, కెమెరా: మధు నీలకందన్ చేస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, రవిశంకర్ కలిసి ర్యాపో22 నిర్మిస్తున్నారు.