సోనీలివ్‌లో అఖిల్ అక్కినేని ఏజంట్

సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అఖిల్ అక్కినేని, సాక్షి వైద్య జంటగా చేసిన ‘ఏజంట్’ థియేటర్లలో విడుదలై రెండేళ్ళవుతోంది. గూఢచారి యాక్షన్ మూవీగా వచ్చిన ప్రేక్షకులను పెద్దగా మెప్పించలేకపోయింది.

థియేటర్లలో బాక్సులు సర్దేసుకున్నాక నేరుగా ఓటీటీలోకి వచ్చేయాలి. కానీ ఇంతవరకు ఓటీటీలోకి ఎందుకు రాలేదో తెలీదు కానీ ఇప్పుడు సోనీ లివ్‌లోకి వచ్చేసింది. రేపు హోలీ పండుగ సందర్భంగా ఓటీటీలోకి వస్తుందని ప్రకటించినప్పటికీ ఈరోజు నుంచే ప్రసారమవుతోంది. కనుక అక్కినేని అభిమానులు ఏజంట్ ఫైట్స్ ఎలా చేశాడో హ్యాపీగా చూసుకోవచ్చు. 

కధేమిటంటే, ఓ మధ్యతరగతి కుటుంబానికి చెందిన మన హీరో ఎప్పటికైనా పెద్ద గూఢచారి కావాలనుకుంటాడు. అందుకోసం ‘రా’లో చేరేందుకు మూడుసార్లు పరీక్షలు వ్రాస్తాడు కానీ ఫెయిల్ అవుతుంటాడు.

ఇలా లాభం లేదనుకొని రా అధినేత మహదేవ్ (మమ్మూటి) సిస్టమ్ హ్యాకింగ్ చేసి ఆయన తన నైపుణ్యం గుర్తించేలా చేయాలనుకుంటాడు. కానీ అదే సమయంలో విలన్‌ ఎంట్రీ ఇచ్చి చైనా సాయంతో ‘మిషన్ రాబిట్’ పేరుతో భారత్‌లో పెద్ద విధ్వంసం సృష్టించేందుకు పెద్ద కుట్ర చేస్తున్నట్లు పసిగట్టిన మహదేవ్ మన హీరోని రంగంలో దించుతాడు. ఆ తర్వాత హీరో యాక్షన్ సీన్స్ ఓటీటీలో చూసి తీరాల్సిందే.