2.0 హీరో రజిని కాదు అక్షయ్..!

అదేంటి అంత షాక్ ఇచ్చారు సూపర్ స్టార్ రజిని రోబో సీక్వల్ గా వస్తున్న 2.0లో అక్షయ్ హీరో అనడమేంటి అని ఆశ్చర్యపోవచ్చు. అయితే ఈ మాటలన్నది ఎవరో కాదు స్వయంగా రజినికాంతే. నిన్న జరిగిన ఫస్ట్ లుక్ రిలీజ్ కార్యక్రమంలో భాగంగా కరణ్ జోహార్ తో జరిపిన సంభాషణలో రజిని 2.0 హీరో తాను కాదని అక్షయ్ కుమార్ అని అన్నారు. నాకు ఛాన్స్ దొరకదు కాని లేదంటే ఆ రోల్ తాను చేసి ఉండే వాడినని అన్నారు.

అక్షయ్ కుమార్ ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారని సినిమా చూశాక ఆ కష్టం తెలుస్తుందని అంతేకాదు సినిమా స్క్రీన్ మీద అక్షయ్ విశ్వరూపం చూస్తారని అన్నరు. అయితే దీనికి సమాధానంగా అక్షయ్ కూడా ఇలాంటి పెద్ద సినిమాలో భాగం అయ్యినందుకు సంతోషంగా ఉందని.. తన 25 ఏళ్ల కెరియర్ లో ఈ సినిమాకు మాత్రమే తాను మేకప్ వేసుకున్నానని అంత కష్టపడినా తనకు సంతోషంగా ఉందని అన్నారు.

ఇక శంకర్ కూడా రోబో సినిమా ఎవరెస్ట్ ఎక్కడం లాంటిది అయితే ఇప్పుడు ఈ 2.0 మాత్రం ఆ ఎవరెస్ట్ ను మోస్తూ మరో శిఖరం ఎక్కడం లాంటిది అన్నారు. రజిని రోబోగా అక్షయ్ కుమార్ విలన్ గా నటించిన ఈ సినిమాలో ఎమీ జాక్సన్ హీరోయిన్ గా నటించింది.