ఛాంపియన్‌గా వస్తున్న రోషన్

ప్రముఖ నటుడు శ్రీకాంత్ కుమారుడు రోషన్ పుట్టినరోజు సందర్భంగా అతను హీరోగా చేస్తున్న సినిమా పేరు, ఫస్ట్ గ్లింమ్స్‌ విడుదల చేశారు. ప్రదీప్ అద్వైతం దర్శకత్వంలో ఫుట్‌బాల్ తీయబోతున్న ఈ సినిమా పేరు ‘ఛాంపియన్’ అని ప్రకటించారు.

ఈ సినిమాలో రోషన్ ఫుట్‌బాల్ ప్లేయర్‌గా నటించబోతున్నాడు. అయితే మరోవైపు బ్రిటిష్ గుర్రాలపై ఆయుధాలతో వచ్చిన బ్రిటిష్ సైనికులను ఫస్ట్ గ్లింమ్స్‌లో చూపడంతో ఇదో పీరియాడికల్ సినిమా అని స్పష్టమవుతోంది.

హిందీలో అమీర్ ఖాన్ ప్రధానపాత్రలో వచ్చిన ‘లగాన్’ కూడా క్రికెట్, బ్రిటిష్ నేపధ్యంతో తీశారు. బహుశః ఈ సినిమా కూడా అలాగే సాగుతుందేమో. కానీ ఈ సినిమాలో హీరో 'ఛాంపియన్' అని ముందే చెప్పేశారు కనుక సినిమాలో హీరో ఎలివేషన్, ఫైట్స్ ఉంటాయని ఫస్ట్ గ్లింమ్స్‌లోనే చెప్పేశారు. 

ఈ సినిమా కధ,దర్శకత్వం, స్క్రీన్ ప్లే, డైలాగ్స్: ప్రదీప్ అద్వైతం, సంగీతం: మిక్కీ జే మేయర్, కెమెరా: మధి,  ఎడిటింగ్: కోటగిరి వేంకటేశ్వర రావు, ఆర్ట్: తోట తరణి చేస్తున్నారు. 

ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, స్వప్న సినిమా, కాన్సెప్ట్ ఫిల్మ్స్ బ్యానర్లపై ప్రియాంక దత్, జీకే మోహన్, జెమిని కిరణ్ కలిసి ఈ సినిమా నిర్మిస్తున్నారు.