
నందమూరి హీరో కళ్యాణ్ రామ్, విజయశాంతి ప్రధాన పాత్రలలో చేస్తున్న ‘అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి’ ప్రీ టీజర్ శుక్రవారం హోలీ పండుగ సందర్భంగా విడుదల కాబోతోంది. ఈ సినిమాలో విజయశాంతి పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ వైజయంతిగా నటిస్తున్నారు. ఆమె కుమారుడు అర్జున్‌గా కళ్యాణ్ రామ్ నటిస్తున్నారు. సాయి మంజ్రేకర్, సోహాలి ఖాన్ ఈ సినిమాలో ముఖ్య పాత్రలు చేస్తున్నారు.
ఈ సినిమాకు కధ, దర్శకత్వం: ప్రదీప్ చిలుకూరి, సంగీతం అజనీష్ లోక్నాధ్, కెమెరా: రామ్ ప్రసాద్, ఎడిటింగ్: తమ్మిరాజు చేస్తున్నారు.
ఎన్టీఆర్ ఆర్ట్స్, అశోకా క్రియేషన్స్ బ్యానర్లపై ముప్పా వెంకయ్య చౌదరి, సునీల్ బులుసు కలిసి నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ తుది దశకు చేరుకుంది. రేపు ప్రీ-టీజర్లో సినిమా ఎప్పుడు విడుదల చేయబోతున్నారో ప్రకటించే అవకాశం ఉంది.