
సౌత్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం హీరోలందరు తమ అభిమానులతో రెగ్యులర్ గా టచ్ లో ఉండేందుకు సోషల్ మీడియాను బాగా వాడుతున్నారు. అయితే ఈ క్రమంలో పవర్ స్టార్ ట్విట్టర్ లోకి ప్రవేశించారు. కేవలం పవన్ 100 ట్వీట్స్ కే 1 మిలియన్ ఫాలోవర్స్ ను పొందాడు పవన్ కళ్యాణ్. సో ఇది చాలదు పవర్ స్టార్ స్టామినా ఏంటో చెప్పడానికి. ఓ పక్క సినిమాల్లో నటిస్తూనే మరో పక్క తాను స్థాపించిన జనసేన పార్టీ అధినేతగా ప్రజల తరుపున మాట్లాడుతున్నాడు పవన్.
ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న కాటమరాయుడు అనుకున్నట్టుగా షూటింగ్ జరుపుకుంటుంది. అది పూర్తి చేశాక త్రివిక్రం సినిమా షూటింగ్ లో పాల్గొంటాడు. ఇక తమిళ దర్శకుడు నేసన్ సినిమా కూడా కమిట్ అయిన పవన్ కళ్యాణ్ త్రివిక్రం సినిమాతో పార్లర్ గా ఆ సినిమాలో కూడా నటిస్తాడట. ఈ లెక్కన చూస్తే 2017లో పవర్ స్టార్ మూడు సినిమాలో రిలీజ్ అవుతాయన్నమాట. సో ఈ విషయం తెలుసుకున్న ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు.