కార్తీక్ ఆర్యన్-శ్రీలీల డేటింగ్ నిజమే?

డాన్సింగ్ క్వీన్‌ శ్రీలీల బాలీవుడ్‌ నటుడు కార్తీక్ ఆర్యన్ డేటింగ్ చేస్తున్నట్లు బాలీవుడ్‌లో జోరుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వాటిని ధృవీకరిస్తున్నట్లు మాట్లాడారు కార్తీక్ ఆర్యన్ తల్లి మాలా తివారి.

ఐఫా అవార్డులు 2025  కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు “మీ కోడలు ఏవిదంగా ఉండాలని కోరుకుంటున్నారు?” అని ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ ప్రశ్నించగా, “మా కోడలు మంచి వైద్యురాలు అయ్యుండాలని కోరుకుంటున్నాను,” అని ఆమె సమాధానం చెప్పారు. 

శ్రీలీల ఓ పక్క సినిమాలు చేస్తూనే ఎంబీబీఎస్ చేస్తోంది. కనుక కార్తీక్ ఆర్యన్-శ్రీలీల డేటింగ్ చేస్తుండటం నిజమేనని ఆమె ధృవీకరించిన్నట్లే భావించవచ్చు. 

ఇటీవల కార్తీక్ ఆర్యన్‌ సోదరి కార్తీక తివారీ ఎంబీబీఎస్ పూర్తి చేసిన సందర్భంగా వారి ఇంట్లో అట్టహాసంగా పార్టీ జరిగింది. దానిలో పాల్గొన్న శ్రీలీల అందరితో కలిసి హుషారుగా డాన్స్ చేసింది. అప్పటి నుంచే వారిద్దరూ డేటింగ్ చేస్తున్నారనే ఊహాగానాలు మొదలయ్యాయి. 

బాలీవుడ్‌ దర్శకుడు అనురాగ్ బసు దర్శకత్వంలో శ్రీలీల, కార్తీక్ ఆర్యన్ జంటగా ఓ హిందీ సినిమా చేస్తున్నారు. ఆ సినిమా కోసం కలిసినప్పుడు వారి మద్య స్నేహం ఏర్పడి, ఇద్దరూ డేటింగ్ చేస్తున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. 

ఇప్పుడు హీరో తల్లి కూడా ఈ విషయం ధృవీకరించారు కనుక దక్షిణాది నుంచి బాలీవుడ్‌లోకి వెళ్ళి అక్కడే స్థిరపడిన శ్రీదేవి, జయప్రద తదితర కోడళ్ళ జాబితాలో శ్రీలీల పేరు కూడా చేరుతుందేమో?