
రంభ, ఊర్వశీ, మేనక అప్సరసలని తెలిసిందే. మన సినీ పరిశ్రమలో కూడా అటువంటి అప్సరసలు చాలా మందే ఉన్నారు. ఊర్వశీ రౌతేలా తన డాన్సుతో తెలుగు ప్రేక్షకులనే కాదు ‘డాకూ మహరాజ్’ మనసు కూడా గెలుచుకుంది. ఇక 1990లలో ‘రంభ’ తన అందచందాలు, నటన, డాన్సులతో అందరినీ మెప్పించారు.
ఆ తర్వాత 2010 లో కెనడా బిజినెస్ మ్యాన్ని పెళ్ళిచేసుకొని వెళ్ళిపోయారు. అప్పటి నుంచి ఒక్క సినిమా కూడా చేయలేదు. కానీ మంచి సినిమా, మంచి పాత్ర లభిస్తే చేసేందుకు సిద్దంగా ఉన్నారని ఇటీవల వార్తలు వచ్చాయి. అవి పుకార్లు కాదు నిజమేనని ప్రముఖ కోలీవుడ్ నిర్మాత కలైపులి ఎస్.ధాను చెప్పేశారు.
ఇటీవల రంభ దంపతులు ఓ కార్యక్రమంలో కలిసినప్పుడు ఆమె మళ్ళీ సినిమాల్లో నటించాలనుకుంటున్నారని చెప్పారని కలైపులి ఎస్.ధాను చెప్పారు. ఆమె కోసం తగిన పాత్ర ఉంటే తప్పకుండా ఆమెను తన సినిమాలోకి తీసుకుంటానని చెప్పారు. అంటే రంభ రీ ఎంట్రీ ఖాయమనే భావించవచ్చు. రంభ, ఊర్వశీ వచ్చేశారు మరి మేనక? ఆ మేనక ఎవరో ఎప్పుడొస్తుందో?