
సంగారెడ్డి మాజీ కాంగ్రెస్ ఎమ్మెల్యే, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సినిమాలో నటిస్తున్నారు. ఈ విషయం ఆయన స్వయంగా మీడియాకు తెలియజేశారు. ఈ సినిమా పేరు ‘జగ్గారెడ్డి.’ సబ్ టైటిల్ వార్ ఆఫ్ లవ్. తన జీవితగాధకు దగ్గరగా ఉండే ఈ సినిమాలో తాను మాఫియాని ఎదిరించి యువ జంట పెళ్ళి చేసే ప్రధాన నాయకుడి పాత్రలో నటించబోతున్నానని చెప్పారు.
ఈ సినిమాలో నటించేందుకు సిఎం రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్లకు ముందుగా తెలియజేసి వారి అనుమతి తీసుకున్నానని చెప్పారు. త్వరలోనే షూటింగ్ మొదలుపెట్టి వచ్చే ఏడాది ఉగాదికి విడుదల చేయాలనుకుంటున్నట్లు చెప్పారు. ఈ సినిమాని పాన్ ఇండియా మూవీగా తీయబోతున్నామని చెప్పారు. త్వరలోనే ఈ సినిమాకు సంబందించి పూర్తి వివరాలు ప్రకటిస్తామని జగ్గారెడ్డి చెప్పారు.