
వెంకీ కుడుమల దర్శకత్వంలో నితిన్, శ్రీలీల జంటగా ‘రాబిన్‌హుడ్’ ఈ నెల 28న విడుదల కాబోతోంది. ఈ సినిమాలో ‘అదిదా సర్ప్రైజు...’ అంటూ సాగే ఓ ఐటెమ్ సాంగ్ ఇదివరకే విడుదల కావలసి ఉంది. కానీ సినిమా రిలీజ్ వాయిదా పడటంతో ఆ పాట రిలీజ్ కూడా వాయిదా పడింది. ఈ పాటకు కేతికా శర్మ డాన్స్ చేసింది.
ఇప్పుడు సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతున్నందున ఈ పాటని రేపు సోమవారం విడుదల చేయబోతున్నారు. ఇదే విషయం తెలియజేస్తూ కేతికా శర్మ, దర్శకుడు వెంకటేష్ కుడుమల మద్య జరిగిన చిన్న ఫోన్ సంభాషణ వీడియోని కూడా ‘అదిదా సర్ప్రైజు’ అంటూ పోస్ట్ చేశారు.
ఈ సినిమాకు కధ, దర్శకత్వం: వెంకీ కుడుముల, సంగీతం: జీవి ప్రకాష్, కెమెరా: సాయి శ్రీరామ్, ఆర్ట్ డైరెక్టర్: రామ్ కుమార్, ఎడిటింగ్: కోటి చేశారు.
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ ‘రాబిన్ హుడ్’ని పాన్ ఇండియా మూవీగా 5 భాషలలో నిర్మించారు.
The dazzling @TheKetikaSharma gets a surprise 😅😅#Robinhood third single #AdhiDhaSurprisu out tomorrow ❤🔥
A @gvprakash musical.
Lyrics by Academy Award Winner @boselyricist
Choreography by @OfficialSekhar#Robinhood IN CINEMAS WORLDWIDE ON MARCH 28th.@actor_nithiin… pic.twitter.com/U5JilCPxuk