గోపీచంద్ మలినేని బాలీవుడ్‌ మూవీ జాట్ అప్‌డేట్‌

గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలీవుడ్‌ సీనియర్ నటుడు సన్నీ డియోల్, రణ్‌దీప్ హుడా ప్రధాన పాత్రలలో ‘జాట్’ అనే పాన్ ఇండియా మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో రెజీనా, వినీత్ కుమార్‌ సింగ్, సయామీ ఖేర్ ముఖ్య పాత్రలు చేస్తున్నారు.

ఈ సినిమాలో రణదీప్ హుడా విలన్‌గా నటిస్తున్నాడు. అతని ఫస్ట్-లుక్‌ పోస్టర్ ఈ నెల 10న ఉదయం 10.35 గంటలకు విడుదల చేయబోతున్నామని గోపీచంద్ మలినేని ట్వీట్ చేశారు.  

మైత్రీ మూవీ మేకర్స్‌, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాకు సంగీతం: తమన్, స్టంట్స్: రామ్ లక్ష్మణ్‌, కొరియోగ్రాఫర్: అనల్ ఆరాసు, ప్రొడక్షన్ డిజైనర్: అవినాష్ కొల్లా చేస్తున్నారు. 

ఇటీవల విడుదలైన జాట్ టీజర్‌ అందరినీ ఆకట్టుకుంది. సినిమాపై అంచనాలు మరింత పెంచింది. ఈ సినిమా ఏప్రిల్ 10న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది.