మాస్ జాతర తర్వాత అనార్కలితో వస్తాడట

మాస్ మహరాజ్ రవితేజ ప్రస్తుతం భాను భోగవరపు దర్శకత్వంలో ‘మాస్ జాతర’ పూర్తి చేస్తున్నారు. ఈ సినిమాలో రవితేజకు జోడీగా శ్రీలీల నటిస్తోంది. వారిరువురూ ఈ వేసవి సెలవుల్లో మాస్ జాతరతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమాకు సంగీతం: భీమ్స్ సిసిరోలియో, కెమెరా: కార్తీక్ ఘట్టమనేని, డైలాగ్స్: ఎడిటింగ్: నవీన్ నూలి చేస్తున్నారు.  

శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ సినిమాస్ బ్యానర్లపై నాగ వంశీ, సాయి సౌజన్య కలిసి మాస్ జాతర నిర్మిస్తున్నారు. 

ఈ సినిమా చేస్తుండగానే కిషోర్ తిరుమల చెప్పిన స్టోరీకి రవితేజ ఓకే చెప్పేశారు. ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లతో రవితేజ రొమాన్స్ చేయబోతున్నారు. ప్రేమలు సినిమాతో యువత గుండెల్లో స్థానం సంపాదించుకున్న మమితా బైజు, ఇటీవల విడుదలైన ‘రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్’తో అందరిని ఆకట్టుకున్న కయాడు లోహార్‌ ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లుగా ఖరారు అయినట్లు తెలుస్తోంది.

ఈ సినిమాకు ‘అనార్కలి’ అనే పేరు ఖరారు చేసిన్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమాని అధికారికంగా ప్రకటించినప్పుడు మరిన్ని వివరాలు తెలుస్తాయి.