
కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్-సూపర్ స్టార్ రజినీకాంత్ కాంబినేషన్‌లో వచ్చిన ‘జైలర్’ ఎవరూ ఊహించని స్థాయిలో ఏకంగా రూ.600 కోట్లకు పైగా కలెక్షన్ రాబట్టింది. అప్పుడే దానికి సీక్వెల్ తీయబోతున్నట్లు ప్రకటించారు.
ప్రస్తుతం జ్ఞానవేల్ దర్శకత్వంలో రజినీకాంత్ హీరోగా చేస్తున్న వెట్టాయన్ (తెలుగు వెర్షన్ పేరు వేటగాడు) సినిమా షూటింగ్ పూర్తయింది. కనుక వెంటనే జైలర్ సీక్వెల్ షూటింగ్ మొదలుపెట్టాలని నిర్ణయించారు.
వచ్చే వారం నుంచి చెన్నైలో షూటింగ్ మొదలుపెట్టనున్నారు. చెన్నైలో తొలి షెడ్యూలలో కొన్ని యాక్షన్ సీన్స్ షూటింగ్ చేసిన తర్వాత గోవాలో రెండో షెడ్యూల్ ప్లాన్ చేశారు. ఈ సినిమాలో కూడా మోహన్ లాల్, శివరాజ్ కుమార్ ముఖ్య పాత్రలు చేయబోతున్నారు. ఈ సినిమాకు అనిరుధ్ సంగీతం అందించబోతున్నారు.