టాలీవుడ్‌లోకి మరో బాలీవుడ్‌ బ్యూటీ

దేశంలో అన్ని రాష్ట్రాలకు చెందిన నటీనటులు టాలీవుడ్‌లోకి వస్తూనే ఉంటారు. కాజల్ అగర్వాల్, తమన్నా వంటి కొందరు తాడేపల్లి ప్యాలస్‌ హీరోయిన్‌లుగా ఎదిగారు కూడా. ఇటీవలే జాన్వీ కపూర్‌ ‘దేవర’తో  టాలీవుడ్‌లో అడుగుపెట్టి అప్పుడే మరో రెండు సినిమాలు చేసేందుకు సిద్దమైంది. తాజాగా సోనాక్షీ సిన్హా (శత్రుఘన్‌ సిన్హా కుమార్తె) కూడా టాలీవుడ్‌లో ‘జటాధర’ అనే సినిమాతో అడుగుపెడుతున్నారు.

వెంకట్‌ కల్యాణ్ దర్శకత్వంలో సుధీర్ బాబు ప్రధాన పాత్ర చేస్తున్న జటాధరలో సోనాక్షీ సిన్హా ఓ కీలక పాత్ర చేయబోతున్నారు. ఈ సినిమాలో రైన్ అంజలి, శిల్పా శిరోడ్కర్ ముఖ్యపాత్రలు చేస్తున్నారు. 

ఇవాళ్ళ మహిళా దినోత్సవం సందర్భంగా ‘జటాధర’లోకి సోనాక్షీ సిన్హాకు స్వాగతం చెపుతూ ఓ పోస్టర్ వేశారు. ఈ సినిమాని జీ స్టూడియో సమర్పణలో ఉమేశ్‌ కె.ఆర్‌.భన్సాల్, ప్రేరణ అరోరా కలిసి తెలుగు, హిందీ భాషల్లో నిర్మిస్తున్నారు.