
మహేష్ బాబు-రాజమౌళి కాంబినేషన్‌లో ఎస్ఎస్‌ఎంబీ29 వర్కింగ్ టైటిల్‌తో తీయబోతున్న సినిమా షూటింగ్ ఒరిస్సాలో ప్రారంభం కాబోతోంది. దీనిలో పాల్గొనేందుకు రాజమౌళి బృందం రెండు రోజుల క్రితం హైదరాబాద్ నుంచి భువనేశ్వర్ బయలుదేరి వెళ్ళారు. తొలి షెడ్యూల్ 12 రోజులు ఉంటుంది. ఈ షెడ్యూల్లో మహేష్ బాబు కూడా పాల్గొనబోతున్నట్లు సమాచారం.
ఈ ఏడాది జనవరి 2న ఈ సినిమా పూజా కార్యక్రమం జరిగింది. ఈ సినిమాలో ప్రముఖ బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా ఓ ముఖ్యపాత్ర చేయబోతున్నారు. మలయాళ నటుడు పృధ్వీరాజ్ సుకుమార్, బాలీవుడ్ నటుడు నానా పాటేకర్ ఈ సినిమాలో నటించే అవకాశం ఉంది. కానీ ఇంకా ధృవీకరించలేదు. ఈ సినిమాకు కధ: విజయేంద్ర ప్రసాద్, సంగీతం: ఎంఎం కీరవాణి చేస్తున్నారు.
దుర్గా ఆర్ట్స్ బ్యానర్‌పై కేఎల్ నారాయణ సుమారు వెయ్యి కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ సినిమా నిర్మిస్తున్నారు.