సంబంధిత వార్తలు

విశ్వకరుణ్ దర్శకత్వంలో కిరణ్ అబ్బవరం, రుక్సర్ ధిల్లాన్ జంటగా చేసిన దిల్రుబా ఈ నెల 14న విడుదలకాబోతుండటంతో నిన్న సాయంత్రం ట్రైలర్ విడుదల చేశారు. ట్రైలర్లో కాస్త రొమాన్స్.. మరికాస్త యాక్షన్ సీన్స్ చక్కగా మిక్స్ చేసి వదిలారు కనుక ట్రైలర్, త్వరలో విడుదల కాబోయే సినిమా యువతకి చక్కగా కనెక్ట్ అవుతాయి.
దిల్రుబా సినిమాకి కధ, దర్శకత్వం: విశ్వకరుణ్, సంగీతం: శామ్ సిఎస్, కెమెరా: డానియల్ విశ్వాస్, ఎడిటింగ్: ప్రవీణ్ కేఎల్ చేశారు.
శివం సెల్యులాయిడ్స్ సమర్పణలో యూడ్లీ ఫిల్మ్ బ్యానర్‌పై ప్రముఖ మ్యూజిక్ కంపెనీ సరేగమతో కలిసి రవి, జోజో రోజ్, రాకేశ్ రెడ్డి ఈ సినిమా నిర్మించారు.