
నయనతార, మాధవన్, సిద్ధార్థ్, మీరా జాస్మిన్ ప్రధాన పాత్రలలో ‘టెస్ట్’ అనే ఓ సినిమా చేశారు. చెన్నైలో జరిగిన ఓ అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్ నేపధ్యంలో స్పోర్ట్స్ డ్రామాగా దీనిని తెరకెక్కించారు. ఆ మ్యాచ్ వారి జీవితాలపై ఏవిదంగా ప్రభావం చూపిందనేది ఈ సినిమా కధ. ఎస్. శశికాంత్ దర్శకత్వంలో కుముద పాత్రలో నయనతార, క్రికెటర్ అర్జున్ పాత్రలో సిద్దార్ధ్ నటించారు. మాధవన్, మీరా జాస్మిన్ ముఖ్య పాత్రలు చేశారు. ఒకప్పుడు సినీ పరిశ్రమలో ఓ వెలుగువేలిగిన మీరా జాస్మిన్ పదేళ్ళ తర్వాత మళ్ళీ ఈ సినిమాలో నటించారు.
ఈ సినిమాని ఏప్రిల్ 4 వ తేదీన తెలుగు, తమిళ, మలాయల, కన్నడ, హిందీ భాషల్లో ఒకేసారి విడుదల చేయబోతున్నారు. యావత్ భారతీయుయలను అలరించివన ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్‌కు కధ అందించిన సుమన్ కుమార్ వ్రాసిన కధ ఆధారంగా ఈ సినిమా తీశారు.