మేలో మాస్ జాతర తప్పదట!

మాస్ మహరాజ్ రవితేజ తన కెరీర్‌లో 74 సినిమాలు పూర్తి చేసిన తర్వాత కూడా ఇంకా పడుతూ లేస్తూ ముందుకు సాగుతున్నారు. రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు, ఈగల, మిస్టర్ బచ్చన్ వరుసగా నాలుగు ఫ్లాపులు.. తట్టుకోవడం చాలా కష్టమే. కానీ తప్పదు.

కనుక దర్శకుడుగా మారిన సినీ రచయిత భాను భోగవరపు దర్శకత్వంలో ‘మాస్ జాతర’ మొదలుపెట్టారు. ఈ ఏడాది వేసవి సెలవుల్లో ఈ సినిమా విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకొని షూటింగ్ చేస్తున్నారు. డాన్సింగ్ క్వీన్ శ్రీలీల మాస్ జాతరలో రవితేజకు జోడీగా నటిస్తోంది. 

ఈ సినిమాకు సంగీతం: భీమ్స్ సిసిరోలియో, కెమెరా: కార్తీక్ ఘట్టమనేని, డైలాగ్స్: ఎడిటింగ్: నవీన్ నూలి చేస్తున్నారు.  

శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ సినిమాస్ బ్యానర్లపై నాగ వంశీ, సాయి సౌజన్య కలిసి మాస్ జాతర నిర్మిస్తున్నారు. 

మాస్ జాతర సెట్స్‌ నుంచి బయటకు వచ్చిన తర్వాత కిషోర్ తిరుమల దర్శకత్వంలో 76వ సినిమా మొదలుపెట్టబోతున్నారు. 

ఆడాళ్ళు మీకు జోహార్లు, ఉన్నది ఒకటే జిందగీ వంటి హిట్ చిత్రాలు అందించిన కిషోర్ తిరుమల ట్రాక్ రికార్డ్ బాగుంది కనుక వీరిద్దరి కాంబినేషన్‌లో తీయబోయే సినిమా తప్పకుండా హిట్ అవుతుందనే భావించవచ్చు. బీవీఎస్ రవికుమార్ ఇచ్చిన కధతో ఈ సినిమా తీసి 2026 సంక్రాంతికి విడుదలచేయాలని టార్గెట్ పెట్టుకున్నారు.