
కోలీవుడ్లో ప్రముఖ హాస్య నటుడు ధన్రాజ్ నటించి, దర్శకత్వం చేసిన ‘రామం రాఘవం’ సినిమా ఫిబ్రవరి 21న థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమాలో తండ్రీ కొడుకులుగా సముద్రఖని, ధన్రాజ్ నటించారు. ఇప్పుడు ఈ సినిమా మార్చి 14 నుంచి సన్ నెక్స్ట్ ఓటీటీలో ప్రసారం కాబోతోంది. దీంతో పాటు ఈటీవీ విన్ ఓటీటీలో కూడా ప్రసారం కాబోతోంది.
కధ: దశరధ రామం (సముద్రఖని) చాలా నీతి నిజాయితీ, క్రమశిక్షణ కలిగిన ప్రభుత్వోద్యోగి. ఆయన కుమారుడు రాఘవ (ధన్రాజ్) ఆయనకు పూర్తి భిన్నమైన నడవడిక, అలవాట్లున్నవాడు. కనుక తండ్రీ కొడుకుల మద్య జరిగే ఘర్షణ అనివార్యం. అయితే ఒకానొక దశలో తండ్రిని హత్య చేసేందుకు రాఘవ ప్రయత్నించడం ఈ సినిమాలో పెద్ద ట్విస్ట్.
ఈ సినిమాలో సముద్రఖని, ధన్రాజ్ పోటీపడి నటించి ప్రేక్షకులను మెప్పించారు. కనుక వారి నటన, ఈ సినిమా ఎలా ఉందో ఓటీటీ ప్రేక్షకులు కూడా చూసి నిర్ణయించాలి.