సమంతతో సినిమానా?అంతా గ్యాస్: నందిని

దర్శక నిర్మాతలు, నటీనటులు ఏవిదంగా ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు ఎప్పటికప్పుడు కొత్త కధలని ప్రయత్నిస్తుంటారో, అలాగే మీడియా కూడా తమ ప్రజలను ఆకట్టుకోవడం కోసం కొన్ని పుకార్లు సృష్టించి వదులుతుంటారు. 

అటువంటిదే దర్శకురాలు నందినితో సమంత సినిమా చేయబోతోందనే వార్త కూడా. దీనికి ఆధారం ఏమిటంటే, ఇటీవల ఆమె పుట్టినరోజు సందర్భంగా మీతో ఎక్కువ సమయం గడపాలని కోరుకుంటున్నాను,” అని సమంత చేసిన ట్వీట్. అది పట్టుకొని నందిని, సమంత కలిసి ఓ రొమాంటిక్ డ్రామా సినిమా చేయబోతున్నారని, అది ఓ సినిమాకు తెలుగు రీమేక్ అని పుకార్లు పుట్టించేశారు. 

అవి నందిని చెవిలో పడటంతో ఆమె స్పందిస్తూ, “సమంతతో నేను ఎటువంటి సినిమా చేయడం లేదు. కానీ అవకాశం వస్తే తప్పకుండా చేయాలని కోరుకుంటున్నాను. నేను చేయబోతున్న సినిమా నా ఒరిజినల్ స్క్రిప్ట్ తప్ప దేనికీ రీమేక్ కాదు. ఒకవేళ సమంతతో సినిమా తీసేమాటైతే ఆ విషయం నేనే స్వయంగా సంతోషంగా ప్రకటిస్తాను,” అని నందిని చెప్పారు. 

సమంత కొత్తగా ఏర్పాటు చేసుకున్న తన సొంత బ్యానర్ ‘ట్రా లాలా మూవింగ్ పిక్చర్స్’పై ఓ హీరోయిన్ ఓరియంటడ్‌ సినిమా ‘మా ఇంటి బంగారం’ చేయబోతున్నట్లు ప్రకటించి ఓ పోస్టర్ విడుదల చేశారు. కానీ ఆ సినిమా గురించి తర్వాత ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. కనుక ఆ సినిమా పరిస్థితి ఏమిటో? షూటింగ్‌ ఎంతవరకు పూర్తయిందో తెలియాల్సి ఉంది.