పాపం లైలా! అప్పుడే ఓటీటీలోకి..

విశ్వక్‌ సేన్‌ తొలిసారిగా అందమైన స్త్రీగా నటించిన లైలా సినిమా భారీ అంచనాలు, వివాదాల నడుమ ఫిబ్రవరి 14న థియేటర్లలో విడుదలైంది. కానీ అశ్లీలత డోస్ కాస్త ఎక్కువగా ఉండటం, సినిమాని బాయ్‌కాట్ చేయాలంటూ సోషల్ మీడియాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు చేసిన దుష్ప్రచారం వలన సినిమా దెబ్బ అయిపోయింది. కనుక 4 వారాలు పూర్తవ్యక ముందే లైలా ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఈ నెల 7 నుంచి ఆహా ఓటీటీలో లైలా ప్రసారం కాబోతోంది. 

రామ్ నారాయణ్‌ దర్శకత్వం వహించిన లైలా సినిమాలో ఆకాంక్ష శర్మ విశ్వక్‌ సేన్‌కు జోడీగా నటించింది. లేడీస్ బ్యూటీ పార్లర్ నడిపించే సోనూ మోడల్ (విశ్వక్‌ సేన్‌) ఊహించని సమస్యల్లో చిక్కుకుంటాడు. వాటి నుంచి తప్పించుకోవడానికి స్త్రీ వేషం వేసుకుంటాడు. ఆ వేషంతో హీరోకి కొత్త కష్టాలు మొదలవుతాయి. అవేమిటో ఓటీటీలో చూస్తేనే మజాగా ఉంటుంది!