
నచ్చావులే సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన మాధవిలత ఆ తర్వాత నాచురల్ స్టార్ నానితో స్నేహితుడాలో కూడా నటించి మంచి క్రేజ్ ఏర్పరచుకుంది. అయితే కేవలం అభినయం ప్రాధాన్యత ఉన్న సినిమాలకే తన ఓటు అంటూ కెరియర్ లో భారీ అవకాశాలు వచ్చినా కాదనేసిన ఈ భామ ఇక సిల్వర్ స్క్రీన్ కు దాదాపు గుడ్ బై చెప్పేసి స్మాల్ స్క్రీన్ పై తన ప్రతాపం చూపించాలని చూస్తుంది.
ఇప్పటికే బుల్లితెరను వేడెక్కించే యాంకర్లు తమ హవా కొనసాగిస్తున్నారు. ఇక వారితో పాటుగా స్మాల్ స్క్రీన్ పై సోయగాలు పోయేందుకు వస్తుంది మాధవిలత. జబర్దస్త్ లాంటి కామెడీ షో ప్లానింగ్ లో ఉన్న లీడింగ్ ఎంటర్టైన్మెంట్ చానెల్ ఆ ప్రోగ్రాం కు యాంకర్ గా మాధవిలతను పెట్టబోతున్నారట. అయితే సిల్వర్ స్క్రీన్ పై కట్టు బొట్టుతో కనిపించిన ఈ అమ్మడు ఆ షోలో కాస్త పట్టువిడిచి అందాలు ఆరబోతకు సిద్ధం అవుతుందట.
మరి స్మాల్ స్క్రీన్ ఎంట్రీ ఇస్తున్న మాధవిలత ఎలాంటి క్రేజ్ సంపాదిస్తుందో తెలియదు కాని రెండు మూడు సినిమాలకే ఆమెను అభిమానించిన ఫ్యాన్స్ మాత్రం ఈ న్యూస్ తో ఫుల్ ఖుషిగా ఉన్నారు.