
సప్తగిరి మళ్ళీ చాలా గ్యాప్ తర్వాత పెళ్ళికాని ప్రసాద్ అనే సినిమాతో మార్చి 21న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమా టీజర్ సోమవారం విడుదల చేశారు. టైటిల్‌తోనే సినిమా కధ, కాన్సెప్ట్ చెప్పేశారు కనుక టీజర్లో కూడా అదే చెప్పారు.
అయితే ఇంత చిన్న పాయింట్‌తో రెండున్నర గంటల సినిమాని సాగదీయాలంటే చాలా బలమైన స్క్రీన్ ప్లే ఉండాలి. ఉందో లేదో తెలియాలంటే మార్చి 21 వరకు ఎదురుచూడాల్సిందే.
ఈ సినిమాలో సప్తగిరి, ప్రియాంక శర్మ, బలగం మురళీధర్ గౌడ్, అన్నపూర్ణ, వడ్లమాని శ్రీనివాస్, ప్రమోదీని, బాషా, మీసాల లక్ష్మణ్, రోహిణి, రాంప్రసాద్ ముఖ్య పాత్రలు చేశారు.
ఈ సినిమాకు కధ, దర్శకత్వం: అభిలాష్ రెడ్డి గోపీడి, స్క్రీన్ ప్లే: అఖిల్ ప్రశాంత్ వర్మ, వైఎన్ లోహిత్, డైలాగ్స్: అఖిల్ ప్రశాంత్ వర్మ, సంగీతం: శేఖర్ చంద్ర, కెమెరా: సుజాత సిద్ధార్ధ, ఎడిటింగ్: మధు చేశారు.
తమ మీడియా, చాగంటి సినిమాటిక్ వరల్డ్ బ్యానర్లపై కెవై బాబు, భాను ప్రకాష్ గౌడ్, సుక్కర వేంకటేశ్వర గౌడ్, వైభవ్ రెడ్డి ముత్యాల కలిసి ఈ సినిమా నిర్మించారు.