ది ప్యారడైజ్ ఫస్ట్ గ్లింమ్స్‌

శ్రీకాంత్ ఓదెల-నేచురల్ స్టార్ నాని, జాన్వీ కపూర్‌ కాంబినేషన్‌లో వస్తున్న ‘ది ప్యారడైజ్’ సినిమా ఫస్ట్ గ్లింమ్స్‌ విడుదలైంది. “చరిత్రలో అందరూ చిలకలు, పావురాల గురించే రాసిన్రు.. గదే జాతిలో పుట్టిన కాకుల గురించి రాయలే. ఇది కడుపు మందిన కాకుల కధ. జమానా జమాన కెళ్ళి నడిచే శవాల కధ. అమ్మ రొమ్ములో పాలు లేక రక్తం బోసి పెంచిన ఓ జాతి కధ..” అంటూ వాయిస్ ఓవర్‌తో వచ్చిన ఫస్ట్ గ్లింమ్స్‌లో నాని నిరుపేదల నాయకుడిగా ఓ మొరటువాడిగా కనిపిస్తాడు.            

ఈ సినిమాకి సంగీతం: అనిరుధ్ రవిచందర్ అందిస్తున్నారు. దసరా సినిమా నిర్మాత చెరుకూరి సుధాకర్ తమ ఎస్ఎల్‌వీ సినిమాస్ బ్యానర్‌పై ఈ సినిమా నిర్మిస్తున్నారు. మార్చి 26న ‘ది ప్యారడైజ్’ సినిమా విడుదల చేయబోతున్నట్లు ఫస్ట్ గ్లింమ్స్‌లో ప్రకటించారు. 

ఈ సినిమాతో పాటు శైలేష్ కొలను దర్శకత్వంలో నాని ‘హిట్- థర్డ్ కేస్' సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో అర్జున్ సర్కార్‌ అనే కరకు పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తున్న నానికి జోడీగా శ్రీనిధి శెట్టి నటిస్తోంది. వాల్ పోస్టర్ సినిమా, యూనానిమస్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై నాని, ప్రశాంత్ తీపిర్నేని కలిసి నిర్మిస్తున్న హిట్-3 మే 1వ తేదీన విడుదలకాబోతోంది.