కళ్యాణ్ రామ్ సినిమా రెడీ.. టైటిల్‌ ఏమిటో?

కళ్యాణ్ రామ్ పటాస్, అతనొక్కడే వంటి హిట్స్ కొట్టినప్పటికీ ‘బింబిసార’ ఆయన సినీ ప్రయాణంలో మైలురాయిగా నిలిచింది. దాని తర్వాత డెవిల్, అమిగోస్ సినిమాలలో చాలా అద్భుతంగా నటించారు కానీ అవి కమర్షియల్‌గా సక్సస్ కాలేదు. 

వాటి తర్వాత ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ 21వ సినిమా మొదలుపెట్టి దాదాపు పూర్తి చేశారు. ఈ సినిమా షూటింగ్‌ చివరి దశకు చేరుకుంది. షూటింగ్‌ పూర్తికాక ముందే అప్పుడే ఓటీటీ హక్కులు అమ్మేసిన్నట్లు సమాచారం. త్వరలో ఈ సినిమా టైటిల్, ఫస్ట్ గ్లింమ్స్‌ విడుదల చేయనున్నారు. 

ఈ సినిమాలో విజయశాంతి ఓ కీలకపాత్రలో నటిస్తున్నారు. శ్రీకాంత్, సాయి మంజ్రేకర్, సవహేళ ఖాన్ తదితరులు ముఖ్య పాత్రలు చేస్తున్నారు. 

ఎన్టీఆర్‌ ఆర్ట్స్, అశోకా క్రియేషన్స్ బ్యానర్లపై ముప్పా వెంకయ్య చౌదరి, సునీల్ బులుసు కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాకు కధ, దర్శకత్వం: ప్రదీప్ చిలుకూరి, సంగీతం అజనీష్ లోక్‌నాధ్, కెమెరా: రామ్ ప్రసాద్, ఎడిటింగ్: తమ్మిరాజు చేస్తున్నారు.     

ఈ సినిమా పూర్తికాగానే బింబిసారకు సీక్వెల్‌ తీసేందుకు కళ్యాణ్ రామ్ సన్నాహాలు మొదలుపెట్టారు.