నెట్‌ఫ్లిక్స్‌లోకి తండేల్.. ఎప్పటి నుంచంటే..

చందు మొండేటి మొండేటి దర్శకత్వంలో నాగ చైతన్య, సాయి పల్లవి జోడీగా చేసిన ‘తండేల్‌’ ఫిబ్రవరి 7న థియేటర్లలో విడుదలై ప్రేక్షకులను అలరించి సూపర్ హిట్ అయ్యింది. అక్కినేని కుటుంబానికి వంద కోట్ల కలెక్షన్స్‌ క్లబ్బులో స్థానం కల్పించింది. సినిమా విడుదలై నెలరోజులు పూర్తికాబోతోంది. కనుక మార్చి 7నుంచి నెట్‌ఫ్లిక్స్‌ ఓటీటీలో ప్రసారం అవుతుందని ఆ సంస్థ తెలియజేసింది. కనుక ఈ సినిమా కోసం ఓటీటీ ప్రేక్షకుల ఎదురు చూపులు త్వరలో ముగియబోతున్నాయి. 

భారతీయ మత్స్యకారులు చేపల వేటకు సముద్రంలోకి వెళ్ళినప్పుడు వారి కుటుంబాలు ఎంతగా ఆందోళన చెందుతాయో తండేల్ సినిమా ద్వారా చందు మొండేటి చక్కగా చూపారు. ఆవిదంగా వెళ్ళినవారు పొరపాటున పాకిస్థాన్ జలాలలోకి ప్రవేశిస్తే ఏం జరుగుతుందో దర్శకుడు తండేల్ సినిమాలో చక్కగా చూపారు.

అయితే దీనికి నాగ చైతన్య-సాయిపల్లవిల ప్రేమ, విరహవేదన, భావోద్వేగాలను, అలాగే దేశభక్తిని చక్కగా జోడించడంతో సినిమా ప్రేక్షకులను అలరించింది. ఇప్పుడు ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లోకి వచ్చేస్తోంది కనుక ఓటీటీ ప్రేక్షకులు ఇంట్లోనే కూర్చొని చూసి ఆనందించవచ్చు.