
శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నేచురల్ స్టార్ నాని, జాన్వీ కపూర్ జంటగా చేస్తున్న ‘ది ప్యారడైజ్’ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఈ సినిమా ఫస్ట్ గ్లింమ్స్ మార్చి 3న విడుదల కాబోతోందని ఇదివరకే చిత్ర బృందం ప్రకటిస్తూ ఓ పోస్టర్ వేసింది. తాజాగా మరో ‘రా స్టేట్మెంట్ ఆఫ్ ది ప్యారడైజ్’ మార్చి 3న ఉదయం 11.17 గంటలకు అంటూ ఈసారి ఫస్ట్ గ్లింమ్స్ సమయం కూడా చెప్పేశారు. ఈ సినిమాలో నాని తల్లిగా రమ్య కృష్ణ, విలన్‌గా మోహన్ బాబు నటిస్తున్నారు.
ఈ సినిమాకి సంగీతం: అనిరుధ్ రవిచందర్ అందిస్తున్నారు. దసరా సినిమా నిర్మాత చెరుకూరి సుధాకర్ తమ ఎస్ఎల్వీ సినిమాస్ బ్యానర్‌పై ఈ సినిమా నిర్మిస్తున్నారు. ‘ది ప్యారడైజ్’ సినిమా విడుదల తేదీ ఇంకా ప్రకటించాల్సి ఉంది. బహుశః రేపు ప్రకటిస్తారేమో?
Raw statement of #TheParadiseGlimpse will be out tomorrow
— Srikanth Odela (@odela_srikanth) March 2, 2025
3-3-25
11:17am #TheParadise pic.twitter.com/ZZbC2rlBvp