
కుర్ర హీరో నిఖిల్ రీసెంట్ రిలీజ్ ఎక్కడికి పోతావు చిన్నవాడా సినిమా మొదటి షో నుండి హిట్ టాక్ సొంతం చేసుకుంది. అయితే ఏ సినిమా అయినా సరే అది చిన్నదా పెద్దదా అని చూడకుండా తన అభినందనలు తెలిపే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఎక్కడికి పోతావు చిన్నవాడా సినిమా చూసి ఆ సినిమాకు వస్తున్న రెస్పాన్స్ చూసి చిత్ర దర్శకుడు విఐ ఆనంద్ కు కాల్ చేసి కంగ్రాట్స్ చెప్పాడట. ఇదే విషయాన్ని దర్శకుడు తన ట్విట్టర్ లో పెట్టి సంతోషాన్ని పంచుకున్నాడు.
డిఫరెంట్ కథలతో సినిమాలు తీస్తున్న నిఖిల్ అంతే డిఫరెంట్ టాలెంట్ ఉన్న డైరక్టర్ ను వెతికి పట్టుకుంటున్నాడు. విఐ ఆనంద్ లాస్ట్ మూవీ టైగర్ కూడా పర్వాలేదు అనిపించుకుంది అయితే ఆ సినిమా కన్నా నిఖిల్ ఎక్కడికి పోతావు చిన్నవాడా కమర్షియల్ గా కూడ సూపర్ సక్సెస్ అవుతుంది. పెద్ద నోట్ల వల్ల లాస్ట్ వీక్ సినిమాలకు పెద్దగా వర్క్ అవుట్ కాలేదు కాని ఏదైతే అది అయ్యింది అని నమ్మకంతో రిలీజ్ చేసిన నిఖిల్ సినిమాకు ఆ ఎఫెక్ట్ పడట్లేదు.
ఇక మరో విశేషం ఏంటంటే అల్లు అర్జున్ సోదరుడు అల్లు శిరీష్ తో విఐ ఆనంద్ ఓ సైన్స్ ఫిక్షన్ మూవీ తీసేందుకు రంగం సిద్ధం చేస్తున్నాడట. ఎక్కడికి పోతావు చిన్నవాడా హిట్ తో సత్తా చాటిన ఆనంద్ ఇక శిరీష్ ప్రాజెక్ట్ మీద కూర్చోనున్నాడు.