
విశ్వకరుణ్ దర్శకత్వంలో కిరణ్ అబ్బవరం, రుక్సర్ ధిల్లాన్ జోడీగా చేసిన ‘దిల్రుబా’ మార్చి 14న విడుదల కాబోతోంది. కనుక ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఇప్పటికే దర్శకుడు, నిర్మాత, హీరో హీరోయిన్ల ఇంటర్వ్యూలు వగైరా చేశారు.
తాజాగా హీరో కిరణ్ అబ్బవరం ప్రేక్షకులకు ఓ సర్ప్రైజ్ గిఫ్ట్ ప్రకటించారు. ఈ సినిమా దర్శకుడు ప్రత్యేకంగా డిజైన్ చేసిన బైక్‌ని సినిమా కధ, ప్లాట్ ఊహించి చెప్పినవారికి గిఫ్ట్ గా ఇస్తానని కిరణ్ అబ్బవరం ప్రకటించారు.
అబ్బాయిలైన అమ్మాయిలైన ప్లాట్ చెప్పి బైక్ గిఫ్ట్ తీసుకోవచ్చని చెప్పారు. ఇప్పటికే టీజర్, పాటలు, ఇంటర్వ్యూలలో ఈ సినిమా ప్లాట్ గురించి చాలా క్లూస్ ఇచ్చామని కనుక అవన్నీ చూసినవారు చాలా సులువుగా ఈ సినిమా ప్లాట్ ఏమిటో చేపపేయగలరాని కిరణ్ అబ్బవరం అన్నారు.
ఈ బైక్ గెలుచుకున్నవారితో ఈ బైక్ మీదే ఫస్ట్ డే ఫస్ట్ షోకి వస్తానని కిరణ్ అబ్బవరం చెప్పారు. కనుక ఆలస్యం చేయకుండా వెంటనే సినిమా ప్లాట్ చెప్పేసి బైక్ గెలుచుకోవాలని కిరణ్ అబ్బవరం అన్నారు.
ఈ సినిమాకి కధ, దర్శకత్వం: విశ్వకరుణ్, సంగీతం: శామ్ సిఎస్, కెమెరా: డానియల్ విశ్వాస్, ఎడిటింగ్: ప్రవీణ్ కేఎల్ చేస్తున్నారు.
శివం సెల్యులాయిడ్స్ సమర్పణలో యూడ్లీ ఫిల్మ్ బ్యానర్‌పై ప్రముఖ మ్యూజిక్ కంపెనీ సరేగమతో కలిసి రవి, జోజో రోజ్, రాకేశ్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా మార్చి 14న విడుదల కాబోతోంది.
Eee Bike Meede ❤️#Dilruba #DilrubaFromMarch14th pic.twitter.com/v1qpbMrsJU
— Kiran Abbavaram (@Kiran_Abbavaram) March 2, 2025