
ఈ ఏడాది సంక్రాంతి పండుగకు విడుదలైన మూడు పెద్ద సినిమాలలో వెంకటేష్, మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రలలో చేసిన సంక్రాంతికి వస్తున్నాం సూపర్ హిట్ అయ్యింది. సంక్రాంతి టాపర్‌గా నిలిచింది. ఫ్యామిలీ ఆడియన్స్‌తో పాటు మాస్ ఆడియన్స్‌ని కూడా చాలా మెప్పించింది.
కనుక ఈ సినిమా కోసం ఓటీటీ ప్రేక్షకులు కళ్ళు కాయలు కాసేలా ఎదురుచూశారు. ఈ సినిమా డిజిటల్ హక్కులు సొంతం చేసుకున్న ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5లో మార్చి 1 వ తేదీ సాయంత్రం 6 గంటల నుంచి ‘సంక్రాంతికి వస్తున్నాం’ ప్రసారం అవుతోంది.
జీ5 సంస్థ ఈ విషయం తెలియజేస్తూ ఓ పోస్టర్ పెట్టింది. అది కూడా చాలా ఆకట్టుకుంటుంది.
ఈ సినిమాలో రాజేంద్ర ప్రసాద్, సాయి కుమార్, నరేష్, పృధ్వీరాజ్, శ్రీనివాస్ అవసరాల, ఉపేంద్ర లిమాయే, గణేష్, మురళీధర్ గౌడ్, పమ్మి సాయి, ఆనంద్ రాజ్, సాయి శ్రీనివాస్, మహేష్ బాలరాజ్, ప్రదీప్ కబ్ర, చిట్టి తదితరులు ముఖ్య పాత్రలు చేశారు.
ఈ సినిమాకి కధ, దర్శకత్వం: అనిల్ రావిపూడి, సంగీతం: భీమ్స్ సిసిరోలియో, కెమెరా: సమీర్ రెడ్డి, కొరియోగ్రఫీ: భాను మాష్టర్, ఎడిటింగ్: తమ్మిరాజు, స్టంట్స్: రియల్ సతీష్ చేశారు. శ్రీ వేంకటేశ్వర క్రియెషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు, శిరీష్ కలిసి ఈ సినిమాని నిర్మించారు.