
కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో నార్నె నితిన్, సంగీత శోభన్, రామ్ నితిన్, ప్రియాంక జవాల్కర్ ప్రధాన పాత్రలలో ‘మ్యాడ్ స్క్వేర్’ ఈ నెల 29న విడుదల కావలసి ఉండగా ఒకరోజు ముందే విడుదల కాబోతోంది. నిర్మాత నాగ వంశీ ఈవిషయం ట్విట్టర్ ద్వారా అభిమానులకు తెలియజేశారు.
“మార్చి 29న అమావాస్య పడింది కనుక డిస్ట్రిబ్యూటర్ల సూచన మేరకు ఒకరోజు ముందుగా అంటే మార్చి 28న విడుదల చేస్తున్నాము. సినిమా రిలీజ్ డేట్ మార్చడానికి ఇది తప్ప మరే ఇతర కారణమూ లేదు. మార్చి 28న రాబిన్‌హుడ్, మ్యాడ్ స్క్వేర్ రెండు సినిమాలు ఒకేసారి విడుదల కాబోతున్నాయి. కనుక తెలుగు సినిమాకి ఇది మరపురాని మధురమైన రోజుగా నిలువబోతోంది,” అని నాగ వంశీ ట్వీట్ చేశారు.
మ్యాడ్ స్క్వేర్ సినిమాకు కధ, దర్శకత్వం: కళ్యాణ్ శంకర్, సంగీతం: భీమ్స్ సిసిరోలియో, కెమెరా: శామ్దత్, ఆర్ట్: పెనుమర్తి ప్రసాద్, ఫైట్స్: కరుణాకర్ చేశారు.
సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై హారిక సూర్యదేవర, సాయి సూర్యదేవర ఈ సినిమా నిర్మించారు.