
గ్రామీణ తెలంగాణ నేపధ్యంతో సాగే బలగం సినిమా సూపర్ హిట్ అయిన తర్వాత అటువంటి చక్కటి చిత్రాలు వరుసగా వస్తున్నాయి. అటువంటిదే ఇటీవల విడుదలైన ‘బాపు’ సినిమా కూడా. దయ దర్శకత్వంలో ఫిబ్రవరి 21న విడుదలైన ‘బాపు’లో బ్రహ్మాజీ, ఆమని, అవసరాల శ్రీనివాస్, బలగం సుధాకర్ రెడ్డి, గంగవ్వ, ధన్య బాలకృష్ణ, మణి ఎగుర్ల, రచ్చ రవి తదితరులు ముఖ్య పాత్రలు చేశారు.
కామ్రేడ్ ఫిలిం ఫ్యాక్టరీ బ్యానర్‌పై రాజు, భాను ప్రసాద్ రెడ్డి కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాకి కధ: దయ, పాటలు: శ్యామ్ కాసర్ల, సంగీతం: ఆర్ఆర్ ధృవన్, కెమెరా: వాసు పెండెం చేశారు. ఇప్పుడు ఈ సినిమా జియో హాట్ స్టార్ ఓటీటీలో మార్చి 7 నుంచి ప్రసారం కాబోతోంది.
అప్పుల బాధతో సతమతమవుతున్న ఓ రైతు కుటుంబం రైతు భీమా ద్వారా వచ్చే రూ.5 లక్షలతో ఆ కష్టాల నుంచి బయటపడటానికి ఇంట్లో ఒకరు ఆత్మహత్య చేసుకోవాలనుకోవడం ఎంతో బాధాకరం. ఇటువంటి సున్నితమైన అంశం చుట్టూ అల్లిన కధతో తీసిన సినిమాయే బాపు.