
శ్రీవిష్ణు స్వాగ్ తర్వాత ఒకేసారి రెండు సినిమాలు చేస్తున్నాడు. హుస్సేన్ షా కిరణ్ దర్శకత్వంలో ‘మృత్యుంజయ్’, కార్తీక రాజు దర్శకత్వంలో #సింగిల్ సినిమాలు చేస్తున్నాడు. వీటిలో #సింగిల్ ఫస్ట్ గ్లింమ్స్ ఇటీవల విడుదల కాగా, మృత్యుంజయ్ శుక్రవారం విడుదలైంది.
#సింగిల్ పూర్తిగా కామెడీ ఎంటర్‌టైనర్ అని ఫస్ట్ గ్లింమ్స్‌లోనే స్పష్టం చేసేశారు. ఈ సినిమాలో కేతిక శర్మ, ఇవాన, వెన్నెల కిషోర్ ముఖ్య పాత్రలు చేస్తున్నారు.
ఈ సినిమాకి కధ, దర్శకత్వం: కార్తీక రాజు, సంగీతం: విశాల్ చంద్రశేఖర్, కెమెరా: ఆర్. వేల్ రాజ్, డైలాగ్స్: భాను భోగవరపు, నందు సవిరిగన, ఆర్ట్: చంద్రిక గొర్రిపాటి, ఎడిటింగ్: ప్రవీణ్ కేఎల్ చేస్తున్నారు.
గీతా ఆర్ట్స్, కాల్య ఫిలిమ్స్ బ్యానర్లపై విద్యా కొప్పయినీది, భాను ప్రతాప్, రియాజ్ చౌదరి కలిసి ఈ సినిమా నిర్మిస్తున్నారు.