రామ్ చరణ్‌, సుకుమార్ దుబాయ్‌కి వెళ్ళారట?

గేమ్ చేంజర్‌ తర్వాత రామ్ చరణ్‌ బుచ్చిబాబు సాన దర్శకత్వంలో సినిమా మొదలుపెట్టారు. ఈ సినిమా టైటిల్‌ ‘పెద్ది’ అని ప్రచారం జరుగుతోంది కానీ ఇంకా ధృవీకరించలేదు అలాగని ఖండించలేదు. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్‌తో తీస్తున్న ఈ సినిమాలో రామ్ చరణ్‌కి జోడీగా జాన్వీ కపూర్‌ నటిస్తోంది. ఇటీవల కొన్ని రోజులు హైదరాబాద్‌లో ఈ సినిమా షూటింగ్ జరిగింది.

మరో వారం పడి రోజులలో దీని తర్వాత షెడ్యూల్‌ మొదలవుతుంది. ఈ గ్యాప్‌లో రామ్ చరణ్‌, దర్శకుడు సుకుమార్ కలిసి దుబాయ్‌ వెళ్ళిన్నట్లు తాజా సమాచారం. వారిద్దరూ కలిసి ఓ సినిమా చేయాలని చాలా కాలంగా అనుకుంటున్నారు. కనుక ఆ సినిమా స్టోరీ స్క్రిప్ట్ గురించి చర్చించుకోవడానికి వారు దుబాయ్‌ వెళ్ళిన్నట్లు తెలుస్తోంది. 

ఈలోగా బుచ్చిబాబు తదుపరి షెడ్యూల్‌ షూటింగ్‌ కోసం అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈసారి రామ్ చరణ్‌తో పాటు కన్నడ నటుడు శివరాజ్ కుమార్‌ కూడా పాల్గొనబోతున్నారు. ఈ సినిమాలో జగపతి బాబు, దివ్యేంద్రు ముఖ్య పాత్రలు చేస్తున్నారు. 

ఈ సినిమాకి సంగీతం: ఏఆర్ రహమాన్‌, కెమెరా: రత్నవేలు, ఆర్ట్: కొల్ల అవినాష్ చేస్తున్నారు. వృద్ధి సినిమాస్, మైత్రీ మూవీ మేకర్స్‌, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై కిలారు సతీష్ నిర్మిస్తున్నారు.