
ప్రముఖ సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ కుమార్ మంచి నటుడు కూడా. ఆయన సంగీతం అందించి హీరోగా నటించిన తాజా చిత్రం కింగ్‌స్టన్ మార్చి 7న విడుదల కాబోతోంది. సంగీత దర్శకుడి సినిమా అంటే పాటలు, సంగీతం కధాంశంగా ఉంటుందనుకుంటే పొరబడిన్నట్లే. తన ఊరి ప్రజలను కాపాడుకోవడం కోసం సముద్ర గర్భంలో దాగిన దుష్టశక్తులతో హీరో చేసే సాహసోపేతమైన పోరాటాలే ఈ సినిమా కధ! నిన్న విడుదల చేసిన కింగ్‌స్టన్ ట్రైలర్ చూస్తే ఈ విషయం అర్దమవుతుంది.
కమల్ ప్రకాష్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో జీవీ ప్రకాష్ కుమార్, దివ్య భారతి, చేతన్, అజగం పెరుమాళ్, ఇలాంగో కుమారవేల్, ఆంటోనీ తదితరులు ముఖ్య పాత్రలు చేశారు.
ఈ సినిమాకు కధ, దర్శకత్వం: కమల్ ప్రకాష్, సంగీతం: జీవీ ప్రకాష్ కుమార్, కెమెరా: గోకుల్ బినాయ్, కొరియోగ్రఫీ: కళ్యాణ్, బాబా భాస్కర్, ఎడిటింగ్: శాన్‌ఫ్రాన్సిస్‌కో లోకేష్, ఆర్ట్: ఎస్ ఎస్ మూర్తి, స్టంట్స్: దిలీప్ సుబ్బరాయన్ చేశారు.