మ్యాడ్ స్క్వేర్.. టీజర్‌

నార్నె నితిన్, సంగీత శోభన్, రామ్ నితిన్, ప్రియాంక జవాల్కర్ ముఖ్యపాత్రలలో నటించిన మ్యాడ్ స్క్వేర్ టీజర్‌ ఈరోజు విడుదలైంది. రెండు నిమిషాల నిడివి కూడా లేని టీజర్‌లో అంత కామెడీ నింపేయడం, దాంతో అలరించడం మామూలు విషయం కాదు. టీజర్‌ ప్రకారం సినిమా ఉంటే సూపర్ హిట్ అవడం ఖాయం. 

ఈ సినిమాకు కధ, దర్శకత్వం: కళ్యాణ్ శంకర్, సంగీతం: భీమ్స్  సిసిరోలియో, కెమెరా: శామ్దత్, ఆర్ట్: పెనుమర్తి ప్రసాద్, ఫైట్స్: కరుణాకర్ చేస్తున్నారు. 

సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై హారిక సూర్యదేవర, సాయి సూర్యదేవర ఈ సినిమా నిర్మిస్తున్నారు. మార్చి 29న ఈ సినిమా థియేటర్లలో విడుదల కాబోతోంది.